- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమలలో పెరిగిన భక్తుల రద్ధీ.. 27 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు
తిరుమలలో (Thirumala) భక్తుల (Devotees) రద్దీ పెరిగింది.

దిశ, వెబ్ డెస్క్: తిరుమలలో (Thirumala) భక్తుల (Devotees) రద్దీ పెరిగింది. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి (Venkateshwara Swamy) దర్శనానికి దాదాపు పదిహేను గంటల సమయం (15 Hours Time) పడుతోంది. మాఘ మాసం (Magha Masam) పెళ్లిల్ల సీజన్ (Marriages Season) కావడంతో తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వెళుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల (Telugu States) నుంచి వేల మంది భక్తులు (Thousands Of devotees) దర్శనానికి టికెట్లు (Tickets) బుక్ చేసుకున్నారు. ఇక ఇప్పటికే శ్రీవారి దర్శనార్ధం 27 కంపార్ట్‌మెంట్లలో (Compartments) భక్తులు వేచి (Waiting) ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వ దర్శనానికి సుమారు 15 గంటల సమయం పడుతోంది.
ఆదివారం ఒక్క రోజు 84,536 మంది భక్తులకు వేంకటేశ్వర స్వామి దర్శన భాగ్యం కలిగింది. ఇందులో 25,890 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా.. హుండీ ఆదాయం (Hundi Income) రూ3.67 కోట్లుగా టీటీడీ అధికారులు (TTD Officials) వెల్లడించారు. నిన్న ఆదివారం సెలవు దినం కావడంతో భక్తుల తాకిడి పెరిగిందని, ఇవాళ కొంచెం తగ్గే అవకాం ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా.. శ్రీవారి టోకెట్ దర్శనానికి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. మంగళవారం రోజున టోకెన్ దర్శనానికి అనుమంతించేందుకు టీటీడీ అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు ఆదివారం దర్శన టోకెన్లు జారీ చేశారు. తిరుమల బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్, తిరుపతి మహతి ఆడిటోరియం లో టోకెన్లు జారీ చేశారు. ఈ నేల 4వ తేదీనే అనుమతించాల్సి ఉండగా.. రథ సప్తమి కారణంగా వాయిదా పడింది.






