పెరిగిన రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతోందంటే?

by Yella Dhawani Reddy |

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి (Tirupati) కొండపై భక్తుల (Devotees) రద్దీ కొనసాగుతోంది.

పెరిగిన రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతోందంటే?
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి (Tirupati) కొండపై భక్తుల (Devotees) రద్దీ కొనసాగుతోంది. శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు తిరుమలకు పోటెత్తారు. దీంతో తిరుమల కొండకు భక్తుల తాకిడి పెరిగిపోయింది. దీంతో శుక్రవారం ఉదయం స్వామివారి దర్శనం కోసం భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లన్ని నిండిపోయి బయట కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు క్యూలైన్లలో వేచి ఉన్నారు. ఈ క్రమంలో టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పట్టనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఇక గురువారం శ్రీవారిని మొత్తం 65,112 మంది భక్తులు దర్శించుకోగా.. వారిలో 27,331 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. టీటీడీకి రూ.3.49 కోట్లు హుండీ ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.

Next Story