- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వైకుంఠ ఏకాదశిరోజున ఉత్తర ద్వార దర్శనానికి ఎందుకంత ప్రాముఖ్యత?
ముక్కోటి లేదా వైకుంఠ ఏకాది ప్రాముఖ్యతను తెలిపే.. రెండు పురాణ కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: వైకుంఠ ఏకాదశి.. హిందువులంతా ఎంతో పవిత్రంగా భావించే రోజు. వైష్ణవాలయాలన్నీ ఈ రోజున భక్తులతో కిటకిటలాడుతుంటాయి. ఈ పర్వదినం రోజున ఉత్తర ద్వారదర్శనం చేసుకుంటే చాలా మంచిదని, పుణ్యం దక్కుతుందని నమ్మకం. సూర్యుడు ధనస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం జరిగే వరకూ మధ్యనున్న కాలంలో వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ ఏడాది డిసెంబర్ 30న ముక్కోటి ఏకాదశి వచ్చింది. అసలు వైకుంఠ ఏకాదశికి అంత విశిష్టత ఎలా వచ్చింది? దీనికి మన పురాణాల్లో కొన్ని కథలున్నాయి.
శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగి వచ్చి వైకుంఠ ఏకాదశినాడు భక్తులకు దర్శనమిస్తాడని నమ్మకం. మూడుకోట్ల మంది దేవతలతో విష్ణువు దర్శనమిచ్చేందకు వస్తాడు కాబట్టి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందని చెప్తుంటారు. అంతే కాదు.. ఈ ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానమని పురాణాలు చెపతున్నాయి. క్షీరసాగర మథనం జరిగి హాలాహలం, అమృతం ఉద్భవిచింది కూడా ఈ రోజునే.
ముక్కోటి ఏకాదశి పురాణగాథ
ముక్కోటి లేదా వైకుంఠ ఏకాది ప్రాముఖ్యతను తెలిపే.. రెండు పురాణ కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. పూర్వం పర్వతమహర్షి సూచనతో వైఖానసుడు అనే రాజు వైకుంఠ ఏకాదశి వ్రతం చేయడం వల్ల పితృదేవతలకు నరక బాధల నుంచి విముక్తి కలిగి స్వర్గంలోకి ప్రవేశించారు.
పద్మపురాణం ప్రకారం.. మురాసురుడు అనే రాక్షసుడి దురాగతాలు భరించలేక దేవతలు విష్ణువును శరణు కోరతారు. దాంతో ఆయన రాక్షసుడితో తలపడి, అతన్ని సంహరించేందుకు ప్రత్యేక అస్త్రం కావాలని గుర్తించి బదరికాశ్రమంలోని హైమావతి అనే గుహలోకి ప్రవేశించాడు. అక్కడ విశ్రాంతి తీసుకుంటున్న స్వామివారిిని ముర సంహరించేందుకు యత్నించగా.. విష్ణుమూర్తి నుంచి ఉద్భవించిన వైష్ణవీ శక్తి.. దుర్గ రూపంలో ముర అనే రాక్షసుడిని కంటిచూపుతో బూడిద చేసింది. దీంతో విష్ణుమూర్తి ఆ శక్తికి ఏకాదశి అని పేరుపెట్టి.. వరం కోరుకోమని చెప్తాడు. తాను ఆవిర్భవించిన ధనుర్మాస శుక్లపక్ష ఏకాదశిరోజున ఉపవాసం ఉండి భక్తితో సేవించిన వారి పాపాలకు విముక్తి కలగాలని కోరింది. దాంతో విష్ణువు వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని వరమిచ్చారు.






