- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమలలో భారీ వర్షాలతో తగ్గిన భక్తుల రద్దీ.. గంటల్లోనే సులువుగా శ్రీవారి దర్శనం
ఆపదమొక్కలవాడు శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల (Tirumala)లో భారీ వర్షాల కారణంగా భక్తుల రద్దీ తగ్గింది.

దిశ, వెబ్‌డెస్క్: ఆపదమొక్కలవాడు శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల (Tirumala)లో భారీ వర్షాల కారణంగా భక్తుల రద్దీ తగ్గింది. సోమవారం వివిధ రాష్ట్రాలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు మోస్తరుగా తరలివచ్చారు. ఈ మేరకు టోకెన్లు లేని భక్తుల దర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతోంది. ఇక రూ.300 ప్రత్యేక దర్శనం (Special Darshan) టోకెన్ తీసుకున్న వారికి కేవలం గంటలోనే శ్రీవారి దర్శనం అవుతోంది. ఇక మంగళవారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ (Vaikuntam Que Complex)లోని కేవలం 8 కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. సోమవారం స్వామి వారిని 70,345 మంది భక్తులు దర్శించుకున్నారు. 24,292 మంది భక్తులు తమ తలనీలాలు సమర్పించి స్వామి వారి మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ (Srivari Hundi) ఆదాయం రూ.3.43 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు (TTD Offcials) తెలిపారు.






