- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భక్తులకు గుడ్ న్యూస్.. శ్రీవాణి దర్శన టికెట్లు పెంచే యోచన
తిరుమల తిరుపతి (Tirupati) కొండకు నిత్యం వేలాది మంది భక్తులు (Devotees) తరలివస్తుంటారు.

దిశ, వెబ్ డెస్క్: తిరుమల తిరుపతి (Tirupati) కొండకు నిత్యం వేలాది మంది భక్తులు (Devotees) తరలివస్తుంటారు. ఈ క్రమంలో శ్రీవారి దర్శనం కోసం టీటీడీ (TTD) అందించే శ్రీవాణి దర్శన టికెట్లకు డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో టికెట్ల సంఖ్య పెంచాలని టీటీడీ యోచిస్తోంది. ప్రస్తుతం రోజు 1500 టికెట్లు జారీ చేస్తుండగా, ఈ సంఖ్యను 2 వేలకు పెంచాలని అనుకుంటున్నట్లు సమాచారం. ఈ మేరకు ఉన్న అవకాశాలను టీటీడీ అధికారులు పరిశీస్తున్నారు. కాగా, భక్తుల సౌకర్యార్థం టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ పేరుతో దర్శన టికెట్లను జారీ చేస్తోంది. వీటిని ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లో పొందవచ్చు. ప్రతి రోజు తిరుమలలో ఉదయం 10 గంటల నుంచి మొదటి వచ్చిన వారికి మొదటి ప్రాధాన్యతగా 800 టికెట్లు, రేణిగుంట విమానాశ్రయంలో 200 టికెట్లు జారీ చేస్తుంటారు. ఆన్‌లైన్‌లో మరో 500 టికెట్లు జారీ చేస్తుంటారు. అయితే, శ్రీవాణి టికెట్ కోసం భక్తులు టీటీడీకి రూ.10,000 విరాళం ఇవ్వాల్సి ఉంటుంది.






