సరస్వతీ పుష్కరాలకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్

by Yella Dhawani Reddy |

12 ఏండ్ల తర్వాత కాళ్లేశ్వరంలోని త్రివేణి సంగమం వద్ద సరస్వతీ నది పుష్కరాలు ఘనంగా కొనసాగుతున్నాయి.

సరస్వతీ పుష్కరాలకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్
X

దిశ, వెబ్ డెస్క్: 12 ఏండ్ల తర్వాత కాళ్లేశ్వరంలోని (Kaleswaram) త్రివేణి సంగమం వద్ద సరస్వతీ నది (Saraswati River) పుష్కరాలు ఘనంగా కొనసాగుతున్నాయి. పుష్కర ఘాట్‌లో పుణ్యస్నానాలు ఆచరించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు (Devotees) తరలివస్తున్నారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. పుష్కరఘాట్లు, తాగునీటి వసతి, రోడ్ల మరమ్మతులు, పార్కింగ్, పారిశుధ్యానికి దేవాదాయశాఖ ప్రాధాన్యం ఇచ్చింది. ఎండల తీవ్రత దృష్ట్యా టెంట్లు, పందిళ్లతో భక్తులకు సకల ఏర్పాట్లు చేసింది. అంతేకాదు, కాళేశ్వరం వెళ్లే భక్తులకు భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ గుడ్ న్యూస్ చెప్పారు. వాహనాల రద్దీ నియంత్రణలో భాగంగా టోల్‌ట్యాక్స్‌ను (Toll tax) రద్దు చేసినట్లు ప్రకటించారు. ఇక ఈనెల 26వ తేదీ వరకు సరస్వతీ నది పుష్కరాలు జరుగనున్నాయి. దక్షిణాదిన సరస్వతీ పుష్కరాలు కేవలం కాళేశ్వరంలోనే జరగడం విశేషం. అలాగే, 2027లో గోదావరి పుష్కరాలు జరుగనున్నాయి.

Next Story