- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం.. ఏర్పాట్లను పరిశీలించిన చైర్మన్, ఈవో
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు టీటీడీ (TTD) అన్ని ఏర్పా్ట్లను పూర్తి చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు టీటీడీ (TTD) అన్ని ఏర్పా్ట్లను పూర్తి చేసింది. ఈ మేరకు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు సాలకట్ల దివ్యోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే, ఇవాళ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడి (BR Naidu)తో పాటు ఈవో అనిల్ కుమార్ సింఘాల్ (Anil Kumar Singhal), అదనపు ఈవో వెంకయ్య చౌదరి (Venkaiah Chowdary) పరిశీలించారు. భద్రతా విధుల్లో తిరు వీధుల్లో మొత్తం 4 వేలకు పైగా పోలీసులను మోహిరించనున్నారు. ముఖ్యంగా గరుడ సేవ (Garuda Seva) రోజు ఘాట్ రోడ్లపై ద్విచక్ర వాహనాల రాకపోకలను నిలిపివేయనున్నారు. 4 వేల సీసీ కెమెరాలతో తిరుమల, తిరుపతిలో బ్రహ్మోత్సవాల వేల నిరంతర నిఘా ఉండనుంది. విధుల్లో 1,500 మంది టీటీడీ విజిలెన్స్ సిబ్బంది, ఆక్టోపస్ బృందాలు ఉండనున్నాయి.
కాగా, ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu)ను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు (BR Naidu) మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని ఆహ్వాన పత్రికను సీఎంకు ఆయన అందజేశారు. ఈ సందర్భంగా వేద పండితులు చంద్రబాబుకు తీర్థ, ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం ఇచ్చారు.






