వినాయక చవితి రోజున పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-08-25 15:26:06  IST  )

మనం ఏ పని ప్రారంభించినా విఘ్నాలు ఎదురుకాకుండా ఉండాలని ఆ గణనాథుడినే పూజిస్తాం. ఆ బొజ్జగణపయ్యను దేశమంతా కొలిచే పర్వదినం వినాయకచవితి. ఆగస్టు 27న మనమంతా ఈ పర్వదినాన్ని జరుపుకుంటాం.

వినాయక చవితి రోజున పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి
X

దిశ, వెబ్‌డెస్క్: మనం ఏ పని ప్రారంభించినా విఘ్నాలు ఎదురుకాకుండా ఉండాలని ఆ గణనాథుడినే పూజిస్తాం. ఆ బొజ్జగణపయ్యను దేశమంతా కొలిచే పర్వదినం వినాయకచవితి. ఆగస్టు 27న మనమంతా ఈ పర్వదినాన్ని జరుపుకుంటాం. మండపాలు, ఇళ్లలో వినాయక ప్రతిమలను ప్రతిష్టించి 3, 5, 7, 9, 11 రోజులు పూజించి, ధూప దీప నైవేద్యాలను సమర్పించి, నిమజ్జనోత్సవాలు నిర్వహిస్తాం. అయితే వినాయక చవితి రోజును తెలిసీ తెలియక కొందరు కొన్ని పనులు చేస్తుంటారు. ఫలితంగా తెలియకుండా ఏదొక రకంగా నష్టం జరుగుతుంది. మరి వినాయక చవితి రోజున ఏయే పనులు చేయాలి, ఏయే పనులు చేయకూడదు ? పండితులు ఏం చెప్తున్నారు?

వినాయక చవితి పర్వదినం రోజున సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకున్నాక అందరూ తలంటు స్నానం చేసి, పూజా కార్యక్రమాలను ప్రారంభించాలి.

ముఖ్యంగా మీరు కొనుగోలు చేసే గణపతి విగ్రహానికి పగుళ్లు లేకుండా చూస్కోవాలి. గణేషుడు కూర్చుని ఉన్న విగ్రహం శుభప్రదమని పండితులు సూచిస్తున్నారు.

ఎందుకంటే ఆయన కూర్చుని మనం చేసే పూజను, నైవేద్యాన్ని స్వీకరిస్తారని నమ్మకం.

వినాయక పూజలో తులసీదళం, తులసి మాల, తులసి స్తోత్రం చేయడం వంటివి చేయరాదు. మొగలిపువ్వులు కూడా వినాయక పూజకు పనికిరావు.

వినాయక పూజ చేసేటపుడు నలుపు వస్త్రాలను ధరించకూడదు. ఎరుపు, పసుపు రంగు వస్త్రాలను పూజిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

ఈ పర్వదినం రోజున మనసును నిష్కల్మషంగా ఉంచుకోవాలి. అసభ్య పదజాలం వాడకూడదు. పూజ చేసిన వారు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి.

ఇంటి ద్వారానికి, గేటుకు లేదా బాత్రూమ్ గోడకు దగ్గరగా విగ్రహాన్ని ప్రతిష్టించకూడదు.

వినాయకచవితి పర్వదినాన పొరపాటున కూడా నెలవంకను చూడకండి. ఆయన్ను చూస్తే నీలాపనిందలు అంటే చేయని తప్పుకు నిందలు మోయాల్సి ఉంటుంది.

ఇంట్లోనే వినాయకుడిని తయారు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో తప్పకుండా చూడాల్సిందే!

Next Story