- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Karthika Masam 2024: కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులు ఎందుకు వెలిగిస్తారో తెలుసా?
ఈ మాసంలో ప్రతిరోజు సూర్యోదయానికి ముందు నిద్రలేచి దీపం పెట్టాలి.

దిశ, వెబ్ డెస్క్ : కార్తీక మాసంలో ఇష్ట దేవతలకు పూజలు చేస్తుంటాము. ఈ మాసంలో ఏ పూజలు చేసిన కూడా అది దేవ దేవుళ్ళకు చేరుతుందని పండితులు చెబుతున్నారు. మనం చేసే ఏ చిన్న పూజ అయినా వెయ్యిరెట్లు ఫలితాలు ఇస్తుందన్నమాట.
కార్తీక మాసం శివుడికి చాలా ఇష్టమైన మాసమని పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసంలో ప్రతిరోజు సూర్యోదయానికి ముందు నిద్రలేచి దీపం పెట్టాలి. అయితే.. కార్తీక మాసంలో పౌర్ణమి రోజున ఉపవాసం ఉన్న వారు 364 దీపపు వత్తుల్ని వెలిగించాలని అంటుంటారు. ఇలా ఎందుకు వెలిగిస్తారో ఇక్కడ తెలుసుకుందాం..
ఇలా దీపాలు వెలిగించడం వెనుక ఒక పరామార్థం ఉంది. కొందరు తమ ఇళ్ళలో ప్రతిరోజు దీపారాధన చేస్తుంటారు. కానీ, కొన్నిసార్లు దీపం పెట్టడానికి వీలుపడదు. ఇంట్లో ఒకరోజు దీపం పెడితే .. ప్రతిరోజు దీపారాధన చేయాల్సి ఉంటుంది. అలా ఏదైన ఒక రోజు పెట్టకుండా ఉంటే.. ఆ దోషాలు పోగొట్టుకునేందుకు కార్తీక మాసంలో పౌర్ణమి రోజున ఏడాదికి సరిపడా 365 దీపపు వత్తులతో దీపం వెలిగిస్తారని పండితులు చెబుతున్నారు.






