Dangerous Temples: ఇండియాలో ఉన్న ప్రమాదకర ఆలయాలు ఏంటో తెలుసా.. అక్కడికి వెళ్తే తిరిగి వస్తారని గ్యారంటీ లేదు?

by Phanindra |

చూడటానికే భయంకరంగా ఉండే ఈ ప్రదేశానికి భక్తులు ప్రాణాలను పణంగా పెట్టి మరి వెళ్తుంటారు.

Dangerous Temples: ఇండియాలో ఉన్న ప్రమాదకర ఆలయాలు ఏంటో తెలుసా.. అక్కడికి వెళ్తే తిరిగి వస్తారని గ్యారంటీ లేదు?
X

దిశ, వెబ్ డెస్క్ : ఈ ప్రపంచంలో మనకీ తెలియని విషయాలు చాలానే ఉన్నాయి. వాటిలో కొన్ని ఆశ్చర్యం కలిగిస్తాయి. మరికొన్ని ఇవి నిజాలేనా ? నమ్మొచ్చా అనేలా ఉంటాయి. నిజాలెప్పుడూ మనిషి నాలెడ్జ్‌ని పెంచుతాయి. మెదడుకి మేతలా మారి ఆలోచింపజేస్తాయి. మన ఇండియాలో ఉన్న ప్రమాదకర ఆలయాలు గురించి చాలా మందికి తెలియదు. అక్కడికి వెళ్లే వారు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని వెళ్ళాలి. అవి ఎక్కడ ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం..

కాకన్మఠ్ ఆలయం ( kakanmath temple )

మధ్యప్రదేశ్ కి చెందిన ఉన్న కాకన్మఠ్ ఆలయం ..శివుడి కోసం భూతాలుడు ఒక్క రాత్రి లోనే నిర్మించారు. ఇది డేంజర్ అని ఎందుకు చెబుతారంటే.. ఇక్కడికి వెళ్లిన వారు ఒక్క రాయి లాగిన ఆలయం మొత్తం నేల మట్టం అవుతుంది. ఎన్ని ప్రళయాలు వచ్చినా ఇప్పటికీ ఆ ఆలయం చెక్కు చెదరకుండా ఉంది.

హరి హర్ కోట ( Harihar fort )

నాసిక్ కి చెందిన హరి హర్ కోట. ఇక్కడ శివలింగాన్ని దర్శించుకోవడానికి వందకి పైగా నిలువుగా చెక్కబడిన మెట్లను దిగి వెళ్ళాలి. చూడటానికే భయంకరంగా ఉండే ఈ ప్రదేశానికి భక్తులు ప్రాణాలను పణంగా పెట్టి మరి వెళ్తుంటారు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘దిశ’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.

Next Story