- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. ఎండల ఎఫెక్టా?
ఆదివారం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఎండల తీవ్రత నేపథ్యంలోనే రద్దీ తగ్గినట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. వారాంతమైనా భక్తుల రద్దీ తగ్గడం గమనార్హం. ఎండల తీవ్రత అధికంగా ఉన్న క్రమంలో భక్తుల రాక తగ్గినట్లు టీటీడీ భావిస్తోంది. ఆదివారం ఉదయం శ్రీవారి ఉచిత దర్శనం కోసం టోకెన్లు లేకుండా 11 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా.. స్వామివారి దర్శనానికి 8 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది. అలాగే టోకెన్లు పొందిన భక్తులకు సర్వదర్శనానికి 3-4 గంటల సమయం పడుతుందని, రూ.300 శీఘ్రదర్శనానికి 2-3 గంటల సమయం పడుతుందని పేర్కొంది. నిన్న (శనివారం) స్వామివారిని 78,586 మంది భక్తులు దర్శించుకోగా.. 29,232 మంది భక్తులు శ్రీవారికి తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులిచ్చిన కానుకల ద్వారా స్వామివారి హుండీ ఆదాయం రూ.3.27 కోట్లు సమకూరినట్లు టీటీడీ పేర్కొంది. కాగా.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు శ్రీవారి సేవ ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఆర్జిత సేవ, సుప్రభాత సేవ, తోమాల సేవకోసం ఇప్పటికే లక్షలాది మంది భక్తులు రిజిస్టర్ చేసుకున్నారు.






