తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. కేవలం నాలుగు గంటల్లోనే శ్రీవారి దర్శనం

by Kema Shiva Kumar |

Crowd of devotees in Tirumala is normal.. Darshan of Lord Shiva in just four hours

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. కేవలం నాలుగు గంటల్లోనే శ్రీవారి దర్శనం
X

దిశ, వెబ్‌డెస్క్: కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల (Tirumala) క్షేత్రంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మంగళవారం శ్రీవారిని దర్శనానికి జనం చాలా తక్కువ సంఖ్యలో తరలివచ్చారు. ఈ మేరకు టోకెన్లు లేని భక్తులకు కేవలం 4 గంటల్లోనే శ్రీవారి దర్శనం అవుతోంది. ఇక రూ.300 ప్రత్యేక దర్శనం టోకెన్ తీసుకున్న వారు దర్శనానికి వేచి చూడాల్సిన పని లేదు. అదేవిధంగా బుధవారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ (Vaikuntam Que Complex)లో కేవలం 4 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. మంగళవారం స్వామి వారిని 64,684 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో 20,515 మంది భక్తులు తమ తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ (Srivari Hundi) ఆదాయం రూ.3.75 కోట్లు వచ్చాయని టీటీడీ అధికారులు వెల్లడించారు.

Next Story