- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
by Kema Shiva Kumar |
కలియుగ దైవం వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల (Tirumala) క్షేత్రంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.

X
దిశ, వెబ్‌డెస్క్: కలియుగ దైవం వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల (Tirumala) క్షేత్రంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం శ్రీవారిని దర్శనానికి జనం చాలా తక్కువ సంఖ్యలో తరలివచ్చారు. ఈ మేరకు టోకెన్లు లేని భక్తులకు దాదాపు 8 గంటల సమయం పడుతోంది. ఇక రూ.300 ప్రత్యేక దర్శనం టోకెన్ తీసుకున్న వారికి 2 గంటల్లో దర్శనం అవుతోంది. అదేవిధంగా గురువారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ (Vaikuntam Que Complex)లో మొత్తం 11 కంపార్టుమెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు.
కాగా, బుధవారం స్వామి వారిని 63,887 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో 22,561 మంది భక్తులు తమ తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ (Srivari Hundi) ఆదాయం రూ.3.79 కోట్లు వచ్చాయని టీటీడీ అధికారులు వెల్లడించారు.
Next Story






