- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమలలో భారీగా తగ్గిన భక్తుల రద్ధీ
by Malleboina Mahesh |
వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్ధీ భారీగా తగ్గింది.

X
దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వినాయక నవరాత్రులను పిల్లలు, పెద్దలు అని తేడా లేకుండా ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు. దీంతో ప్రజలు వినాయక మండపాలకు అంకితం కావడంతో.. తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తుల రద్ధీ భారీగా తగ్గింది. దీంతో సోమవారం ఉదయం శ్రీవారి సర్వదర్శనానికి 3 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఈ క్రమంలో టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతుంది. ఇదిలా ఉంటే నిన్న ఆదివారం కావడంతో రద్ధీ స్వల్పంగా ఉండటంతో.. నిన్న శ్రీవారిని 70,310 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 21,866 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. అలాగే భక్తుల కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.3.49 కోట్ల వచ్చినట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు.
- Tags
- TTD
Next Story






