తిరుమలకు వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్.. భారీగా పెరిగిన భక్తుల రద్దీ

by Kema Shiva Kumar |   (  Updated:2025-11-28 02:35:37  IST  )

భక్తుల కొంగుబంగారం వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల (Tirumala)లో గురవారం భక్తుల రద్దీ పెరిగింది.

తిరుమలకు వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్.. భారీగా పెరిగిన భక్తుల రద్దీ
X

దిశ, వెబ్‌డెస్క్: భక్తుల కొంగుబంగారం వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల (Tirumala)లో భక్తుల రద్దీ పెరిగింది. శుక్రవారం వివిధ రాష్ట్రాలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తుల రాకతో ఆలయ ఆవరణ కిటకిటలాడుతోంది. ఈ మేరకు టోకెన్లు లేని భక్తుల దర్శనానికి సుమారు 15 గంటల సమయం పడుతోంది. ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి (Special Darshan) టోకెన్ తీసుకున్న వారికి కేవలం 2 గంటల్లో శ్రీవారి దర్శనం అవుతోంది. ఇక శుక్రవారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ (Vaikuntam Que Complex)లోని 30 కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. గురువారం స్వామి వారిని 59,548 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ (Srivari Hundi) ఆదాయం రూ.4.54 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు (TTD Offcials) తెలిపారు.

Next Story