- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బద్రీనాథ్ ఆలయం పునఃప్రారంభం.. భక్తుల దర్శనార్థం తెరుచుకున్న కవాటాలు!
శీతాకాల విరామం తర్వాత బద్రీనాథ్ ఆలయ కవాటాలు నేడు భక్తుల కోసం తెరుచుకున్నాయి. 15 క్వింటాళ్ల పూలతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు.

దిశ, వెబ్ డెస్క్: హిమాలయాల్లోని పవిత్ర పుణ్యక్షేత్రం బద్రీనాథ్ ఆలయం (Badrinath Temple) శీతాకాల విరామం తర్వాత భక్తుల దర్శనార్థం పునః ప్రారంభమైంది. ఈ రోజు(ఏప్రిల్ 23, 2026) వేకువజామున 6:15 గంటలకు సుబ్రహ్మణ్య ముహూర్తంలో వేద మంత్రోచ్ఛారణలు, మేళతాళాల మధ్య ఆలయ ప్రధాన అర్చకులు (రావల్) తలుపులు తెరిచారు. ఈ పవిత్ర ఘట్టాన్ని వీక్షించేందుకు దేశం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. 'జై బద్రీ విశాల్' నామస్మరణతో ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది.
ఆలయ పునఃప్రారంభం సందర్భంగా బద్రీనాథ్ ధామాన్ని సుమారు 15 క్వింటాళ్ల పూలతో అత్యంత సుందరంగా అలంకరించారు. ఇప్పటికే కేదార్‌నాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాలు తెరుచుకోగా, నేడు బద్రీనాథ్ కవాటాలు కూడా తెరుచుకోవడంతో చార్‌ధామ్ యాత్ర పూర్తిస్థాయిలో ప్రారంభమైనట్లయింది. భక్తుల సౌకర్యార్థం ఉత్తరాఖండ్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మంచు కురుస్తున్నప్పటికీ, యాత్రికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భద్రతా మరియు వైద్య సేవలను సిద్ధంగా ఉంచినట్లు అధికారులు వెల్లడించారు.






