- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్‌లో వైభవంగా 7వ వార్షిక బ్రహ్మోత్సవాలు
హైదరాబాద్ బంజారాహిల్స్ లోని హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్ లో 7వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ బంజారాహిల్స్ లోని హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్ లో 7వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ నెల 14వ తేదీ నుంచి 19 వరకూ ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయని ఆలయ అర్చకులు తెలిపారు. 2018లో ఆరంభమైన స్వర్ణ దేవాలయంలో స్వయంభూ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి, శ్రీ శ్రీ రాధాగోవింద ప్రధాన విగ్రహాలుగా వెలసి నిత్యం పూజలు అందుకుంటున్నారు. వీరితో పాటు పాంచజన్యేశ్వర స్వామి, జలగర్భ శాలిగ్రామ శిల, శ్రీ జప ఆంజనేయ స్వామి, ఆచార్య పరంపరా విగ్రహాలను ప్రతిష్ఠించారు.
నవంబర్ 14న శ్రీ లక్ష్మీనరసింహ స్వామి మూలవరు, ఉత్సవ మూర్తులకు అభిషేకంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. నవంబర్ 17, 19 తేదీల్లో శ్రీ భూసమేత నరసింహ స్వామి కళ్యాణోత్సవం, శ్రీ శ్రీ రాధాగోవింద దేవుల 108 కలశ మహాచూర్ణాభిషేకం మరియు మహాసంప్రోక్షణ కార్యక్రమాలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ దేవతామూర్తులకు విశేష అలంకారాలు, పుష్పాలంకరణలు, నూతన వస్త్రాలు, ఆభరణాలతో అలంకరించనున్నారు. దైవ సంకీర్తనలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక ఉత్సాహంతో మార్మోగనుంది.






