- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రూ.7,500 కోట్లు ఎలా ఖర్చు చేశారు: దేవినేని ఉమ
<p>దిశ, ఏపీబ్యూరో: పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ పేరిట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పథకంపై టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సెంటు పట్టా’ పేరిట వైఎస్సార్సీపీ నేతలు చేస్తున్న అవినీతి, దోపిడీపై ప్రజలకు సీఎం జగన్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సెంటు పట్టా భూములకు ప్రభుత్వం 7,500 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెబుతోందని, అంత మొత్తాన్ని ఎప్పుడు? ఎక్కడ? ఎలా? ఖర్చు చేశారో ప్రజలకు […]</p>

X
దిశ, ఏపీబ్యూరో: పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ పేరిట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పథకంపై టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సెంటు పట్టా’ పేరిట వైఎస్సార్సీపీ నేతలు చేస్తున్న అవినీతి, దోపిడీపై ప్రజలకు సీఎం జగన్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సెంటు పట్టా భూములకు ప్రభుత్వం 7,500 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెబుతోందని, అంత మొత్తాన్ని ఎప్పుడు? ఎక్కడ? ఎలా? ఖర్చు చేశారో ప్రజలకు వివరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఉపాధి హామీలో రూ.4 వేల కోట్ల విలువైన పనులు ఎక్కడ చేశారని ఆయన ప్రశ్నించారు. ఇంటి బకాయిలు రూ.4,300 కోట్లు ఎందుకు చెల్లించడం లేదన్నారు.
Next Story






