స్కూళ్ల ప్రారంభంపై మార్గదర్శకాలు

by  |
స్కూళ్ల ప్రారంభంపై మార్గదర్శకాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో నవంబర్ 2 నుంచి పాఠశాలలు ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయాత్తం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పాఠశాల ప్రారంభంపై విద్యాశాఖ పలు మార్గదర్శకాలు విడుదల చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు ఈ మార్గదర్శకాలు వర్తించనున్నాయి. కరోనా నేపథ్యంలో విద్యార్థులకు, టీచర్లకు ఇబ్బందుకుల కలగకుండా చర్యలు చేపడుతున్నారు. కాగా ఈ నేపథ్యంలో మూడు దశల్లో పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. స్కూళ్లో ఒక్కో విద్యార్థికి మధ్య ఆరు అడుగుల దూరం ఉండేలా క్లాస్ రూములు ఏర్పాటు చేశారు. తరగతి గదిలో 16 మంది విద్యార్థులకు మించకుండా ఉండాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది.

అంతేగాకుండా వచ్చే నవంబర్ నెల మొత్తం స్కూళ్లు హాఫ్ డే నిర్వహించడంతో పాటు రోజూ విడిచి రోజు తరగతులు నిర్వహించనున్నారు. అయితే టీచర్లు మాత్రం రోజూ పాఠశాలలకు రావాల్సి ఉంటుందని వెల్లడించింది. తొలుత నవంబర్ 2 నుంచి 9, 10, ఇంటర్మీడియట్ విద్యార్థులకు తరగతులు ప్రారంభం కానున్నాయి. ఇక, స్కూళ్లకు హాజరయ్యే విద్యార్ధులు మాస్క్ ధరించేలా, భౌతిక దూరం పాటించేలా చూడాలని సూచనలు జారీ చేశారు. అలాగే ప్రతి రోజు స్కూ్ళ్లను పరిశుభ్రపరిచేలా చర్యలు తీసుకోవాలి. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించే సమయంలో కోవిడ్ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.

Next Story

Most Viewed