ఢిల్లీ పోలీసులు భేష్ : కోహ్లీ, ఇషాంత్

by Kema Shiva Kumar |   (  Updated:2020-04-12 01:42:35  IST  )

<p>కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో అలుపెరగకుండా శ్రమిస్తున్న పోలీసుల సేవలను టీం ఇండియా సారథి విరాట్ కోహ్లీ, పేసర్ ఇషాంత్ శర్మ కొనియాడారు. వీరితో పాటు క్రీడాకారులు గుత్తా జ్వాల, అంజుబాబీ జార్జ్‌ల సందేశాలతో కూడిన వీడియోలను ఢిల్లీ పోలీసులు తమ ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. పోలీసులు తమ విధులు నిర్వర్తించడంతో పాటు అవసరమైన వారికి ఆహారాన్ని అందించడం పట్ల వారికి కోహ్లీ ఈ వీడియోలో కృతజ్ఞతలు తెలిపాడు. ప్రజలంతా ఇంటి వద్దనే ఉంటూ లాక్ [&hellip;]</p>

ఢిల్లీ పోలీసులు భేష్ : కోహ్లీ, ఇషాంత్
X

కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో అలుపెరగకుండా శ్రమిస్తున్న పోలీసుల సేవలను టీం ఇండియా సారథి విరాట్ కోహ్లీ, పేసర్ ఇషాంత్ శర్మ కొనియాడారు. వీరితో పాటు క్రీడాకారులు గుత్తా జ్వాల, అంజుబాబీ జార్జ్‌ల సందేశాలతో కూడిన వీడియోలను ఢిల్లీ పోలీసులు తమ ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. పోలీసులు తమ విధులు నిర్వర్తించడంతో పాటు అవసరమైన వారికి ఆహారాన్ని అందించడం పట్ల వారికి కోహ్లీ ఈ వీడియోలో కృతజ్ఞతలు తెలిపాడు. ప్రజలంతా ఇంటి వద్దనే ఉంటూ లాక్ డౌన్ నిబంధనలను పాటిస్తూ పోలీసులకు సహకరించాలని సూచించాడు.

ఇషాంత్ శర్మ కూడా ప్రజలందరూ తమ కోసం, తమ కుటుంబ సభ్యుల కోసం ఇంట్లోనే ఉండాలని, అంతేకాకుండా సోషల్ మీడియాలో వస్తున్నా అసత్య ప్రచారాలను పట్టించుకోవద్దని కోరాడు. కరోనాపై పోరులో మనం తప్పకుండా గెలుస్తామని ఇషాంత్ ధీమా వ్యక్తం చేశాడు.

Tags: Delhi Police, Virat Kohli, Ishant Sharma, Gutta Jwala, Lockdown

Next Story