టిక్‌టాక్‌లో ఈ ఫీచర్స్ గురించి తెలుసా?

by  |
టిక్‌టాక్‌లో ఈ ఫీచర్స్ గురించి తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: ‘టిక్‌టాక్’ టాప్ ట్రెండింగ్ యాప్స్‌లో ఒకటిగా ఉంటుందనడంలో సందేహం లేదు. నెటిజన్లలో విపరీతమైన ఆదరణ కలిగి ఉన్న ఈ యాప్‌ను.. యాంటీ చైనా సెంటిమెంట్ కారణంగా బ్యాన్ చేయాలనే వాదన ఇటీవల సోషల్ మీడియా వేదికల్లో చాలా బలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో టిక్‌టాక్‌కు పోటీగా వచ్చిన ‘మిత్రోన్, రూపోసో’ వంటి మేడిన్ ఇండియా యాప్స్ వైపు చాలా మంది దృష్టి సారిస్తున్నారు. అయితే ఇంతటి వ్యతిరేకతలోనూ.. టిక్‌టాక్ యాప్‌కు డౌన్‌లోడ్స్ తగ్గట్లేదనే విషయాన్ని తాజాగా పలు సర్వేలు వెల్లడించాయి. ఈ సర్వే ప్రకారం ఇండియాలోనూ ఈ యాప్‌కు ఆదరణ ఏ మాత్రం తగ్గలేదు. ఇక ‘టిక్‌టాక్‌’లో బేసిక్ ఫీచర్స్ గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. కానీ ఇంకా చాలామందికి తెలియని ఎన్నో ఫీచర్స్ ఆ యాప్‌లో ఉండటం విశేషం. అవేంటో చూద్దాం..

ఏజ్ గేట్ : టిక్‌టాక్‌లో అకౌంట్ క్రియేట్ చేయాలంటే.. తప్పనిసరిగా 13 సంవత్సరాల వయసుండాలి.

స్క్రీన్ టైమ్ మేనేజ్‌మెంట్ :

యాప్‌లో కొన్ని వందల, వేల వీడియోలుంటాయి. ఒక్కసారి అలా వీడియో చూడటం మొదలుపెట్టారా.. ఇక అంతే ! గంటలు గడుస్తున్నా.. అందులోంచి బయటకు రాలేనివారు ఎంతోమంది. అందువల్ల ఎంతసేపు యాప్‌లో గడపాలో యూజర్ డిసైడ్ అయ్యే ఫీచర్ టిక్‌టాక్‌లో ఉంది. ఎలా అంటే.. 60 నిముషాలు, 90 నిమిషాలు, 120 నిమిషాలు ఇలా యూజర్ టైమ్ సెట్ చేసుకొని, పాస్‌వర్డ్ జనరేట్ చేసుకోవాలి. ఆ టైమ్ అయిపోగానే పాస్‌వర్డ్ ఎంటర్ చేయాల్సిందిగా నోటిఫికేషన్ వస్తుంది. అక్కడితో ఆగిపోవచ్చు.. లేదా వీడియోలు చూడాలనుకుంటే ‘పాస్‌వర్డ్’ ఎంటర్ చేసి ముందుకు వెళ్లొచ్చు.

రిస్ట్రిక్టెడ్ మోడ్ :

యూజర్లు రకరకాల వీడియోలు అప్‌లోడ్ చేస్తుంటారు. అందులో కొన్నింటిలో అబ్యూజ్డ్ లాంగ్వేజ్ యూజ్ చేయొచ్చు, అడల్ట్ కంటెంట్ ఉండొచ్చు, హింసాత్మకమైన వీడియోలు ఉండే అవకాశం లేకపోలేదు. ఇవన్నీ కూడా పిల్లలపై చెడు ప్రభావాన్ని చూపిస్తాయి. అందుకే అలాంటి వీడియోలు పిల్లలకు కనిపించకుండా ఉండేందుకు ‘రిస్ట్రిక్టెడ్ మోడ్’ ఆన్ చేయొచ్చు. దీనికో పాస్‌వర్డ్ ఉంటుంది. ఆ పాస్‌వర్డ్ ఎంటర్ చేస్తే.. మళ్లీ నార్మల్ మోడ్‌లోకి వచ్చేస్తుంది. దీని వ్యాలిడిటీ 30 రోజులు ఉంటుంది.

ఇన్ యాప్ సూసైడ్ ప్రివెన్షెన్ :

ఇందులో యూజర్లకు అవసరమైన టిప్స్ అందిస్తారు. అంతేకాదు యూజర్‌కు యాప్ పరంగా ఏమైనా ఇష్యూస్ ఎదురైతే.. ఇందులో సాయం అడగొచ్చు.

రిస్క్ వార్నింగ్ ట్యాగ్ :

ఈ ట్యాగ్ యాడ్ చేసిన వీడియోలు రిస్క్‌తో కూడుకున్నవని అర్థం. ఈ వీడియోలు అందరికీ కనిపించవు. పర్టిక్యులర్ సెక్షన్ యూజర్లకు మాత్రమే కనిపిస్తాయి.

ఫ్యామిలీ పెయిరింగ్ :

పేరెంట్స్ తమ పిల్లలకు సేఫ్టీ, ప్రైవసీ సెట్టింగ్స్ ఈ ఫీచర్ ద్వారా అందించవచ్చు. ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకుంటే.. స్క్రీన్ టైమ్ మేనేజ్‌మెంట్, రిస్ట్రిక్టెడ్ మోడ్, డైరెక్ట్ మెసేజ్ సెట్టింగ్స్‌లు ఆన్ అవుతాయి.

ఇన్-యాప్ రిపోర్టింగ్ :

అబ్జెక్షనేబుల్ కంటెంట్ లేదా బిహేవియర్ ఉంటే.. యూజర్లు ఎవరైనా రిపోర్ట్ చేసే అవకాశాన్ని ఈ ఫీచర్ కల్పిస్తుంది.



Next Story

Most Viewed