IPL : మెగా వేలంపై వార్నర్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చిన SRH.. డేవిడ్ ఇంట్రెస్టింగ్ రిప్లై..

by  |
IPL : మెగా వేలంపై వార్నర్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చిన SRH.. డేవిడ్ ఇంట్రెస్టింగ్ రిప్లై..
X

దిశ, వెబ్‌డెస్క్ : కొద్దిరోజుల్లో IPL మెగా వేలం జరుగనుంది. ఈ వేలంలో స్టార్ క్రికెటర్లు బరిలో నిలిచారు. ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా ఈసారి వేలంలోకి వచ్చిన విషయం తెలిసిందే. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ యాజమాన్యం డేవిడ్‌ను రిటైన్ చేసుకోకపోవడంతో వేలంలోకి వచ్చాడు వార్నర్. ఇదిలా ఉండగా యాషెస్ సిరీస్‌లో వార్నర్ మంచి ఫామ్ కనబరుస్తున్నాడు. దీనిపై స్పందిస్తూ SRH యాజమాన్యం వార్నర్​గురించి ఓ ఆసక్తికర ట్వీట్ చేసి సర్‌ప్రైజ్ ఇచ్చింది.

ట్విట్టర్ వేదికగా.. ‘యాషెస్‌ గెలిచినందుకు కంగ్రాట్స్‌ డేవిడ్. చూస్తుంటే తిరిగి ఫామ్‌లోకి వచ్చినట్లు ఉన్నావుగా. విజయం అనంతరం పార్టీని ఎంజాయ్‌ చేయ్‌. ఇదేకాకుండా మెగా వేలంలో నీకు మంచి జరుగుతుందని ఆశిస్తున్నాం’ అంటూ కామెంట్స్ చేశారు. కాగా దీనిని ట్యాగ్‌ చేస్తూ వార్నర్ ‘ఇది అతిపెద్ద అనుమానం’ అని అర్థం వచ్చేలా పోస్ట్ పెట్టాడు.

మరోవైపు ట్విట్టర్ వేదికగా ఎస్‌ఆర్‌హెచ్‌ ఫ్రాంచైజీ ప్రధాన కోచ్‌గా టామ్‌ మూడీ ఓ అభిమాని సలహా ఇచ్చాడు. ఐపీఎల్ 2022 సీజన్‌ కోసం మంచి జట్టును ఎంచుకోవాలని కోరాడు. దీనికి తప్పకుండా ప్రయత్నిస్తామని మూడీ సమాధానం ఇచ్చాడు.

Read more: ఆ టైమ్‌లో డిప్రెషన్‌కు లోనయ్యా : ఎన్టీఆర్

Next Story

Most Viewed