SRH ఫ్యాన్స్‌ను తలుచుకొని.. ఎమోషనల్ అయిన వార్నర్

by  |
devid Warner
X

దిశ, స్పోర్ట్స్: సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అభిమానులను ఉద్దేశించి ఒక భావోద్వేగ పోస్టు పెట్టాడు. ఐపీఎల్ 2021లో ఆరు మ్యాచ్‌ల తర్వాత కెప్టెన్సీ కోల్పోయిన డేవిడ్ వార్నర్ ఇకపై ఎస్ఆర్‌హెచ్ జట్టుతో కలసి ఉండడనే వార్తలు వస్తున్నాయి. వచ్చే ఏడాది వేరే జట్టును చూసుకునే అవకాశం ఉందంటూ వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో డేవిడ్ వార్నర్ పెట్టిన పోస్టు ఆసక్తికరంగా మారింది. ‘నేను మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తాను అభిమానులారా.. మీకు నా మీద ఉండే ప్రేమకి, ఇంకా మీ సహనానికి ధన్యవాదాలు’ అంటూ ఎమోషనల్ మెసేజ్ చేశాడు. అంతే కాకుండా పక్కన ఒక లవ్ ఎమోజీతో పాటు దండం పెడుతున్న సింబల్ కూడా జత చేశాడు. ఈ పోస్టు చూసిన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. వార్నర్‌ను ఇక జట్టులో చూడమా అని ఫ్యాన్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇది కచ్చితంగా వీడ్కోలు పోస్టు అయి ఉంటుందని విశ్లేషకులు కూడా భావిస్తున్నారు.

Next Story

Most Viewed