- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విషాదం.. కొడుకులు లేక తండ్రి చితికి కూతురు నిప్పు
by Sridhar Babu |
<p>దిశ, వేములవాడ: కంటికి రెప్పలా కాపాడే కన్న తండ్రి అనారోగ్యంతో చనిపోయాడు. పుట్టెడు దుఃఖంతో తండ్రికి కూతురు తలకొరివి పెట్టింది. ఈ హృదయ విదారక ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో వెలుగుచూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కోనరావుపేట మండలంలోని కొలనూర్ గ్రామానికి చెందిన కంకిని శ్రీనివాస్(45) వృత్తి రీత్యా గీత కార్మికుడు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం చనిపోయాడు. మృతుడికి కుమారులు లేక పోవడంతో కూతురు కావ్య తండ్రి చితికి నిప్పు పెట్టింది. ఇది ఇలా […]</p>

X
దిశ, వేములవాడ: కంటికి రెప్పలా కాపాడే కన్న తండ్రి అనారోగ్యంతో చనిపోయాడు. పుట్టెడు దుఃఖంతో తండ్రికి కూతురు తలకొరివి పెట్టింది. ఈ హృదయ విదారక ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో వెలుగుచూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కోనరావుపేట మండలంలోని కొలనూర్ గ్రామానికి చెందిన కంకిని శ్రీనివాస్(45) వృత్తి రీత్యా గీత కార్మికుడు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం చనిపోయాడు. మృతుడికి కుమారులు లేక పోవడంతో కూతురు కావ్య తండ్రి చితికి నిప్పు పెట్టింది. ఇది ఇలా ఉంటే.. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యంతో మంచన పట్టిన ఇంటి పెద్ద మరణించడంతో ఆ కుటుంబం రోడ్డున పడినట్టు అయింది. దీంతో బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Next Story






