RCBకి షాక్.. ఒక ఆటగాడికి కరోనా పాజిటివ్

by Kema Shiva Kumar |   (  Updated:2021-04-06 23:39:55  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: మరో రెండు రోజుల్లో ఐపీఎల్ ప్రారంభవుతున్న వేళ టోర్నీలో ఆడనున్న పలువురు క్రికెటర్లు కరోనా బారిన పడుతుండటం కలకలం రేపుతోంది. దీంతో బీసీసీఐ, ప్రాంచైజీలను కరోనా భయపెడుతోంది. వరుస పెట్టి పలువురు క్రికెటర్లతో పాటు సిబ్బంది కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే అక్షర్ పటేల్‌తో పాటు పలువురు క్రికెటర్లు కరోనా బారిన పడ్డారు. Daniel Sams&#39;s second COVID19 test report today has come positive. He is currently asymptomatic and [&hellip;]</p>

RCBకి షాక్.. ఒక ఆటగాడికి కరోనా పాజిటివ్
X

దిశ, వెబ్‌డెస్క్: మరో రెండు రోజుల్లో ఐపీఎల్ ప్రారంభవుతున్న వేళ టోర్నీలో ఆడనున్న పలువురు క్రికెటర్లు కరోనా బారిన పడుతుండటం కలకలం రేపుతోంది. దీంతో బీసీసీఐ, ప్రాంచైజీలను కరోనా భయపెడుతోంది. వరుస పెట్టి పలువురు క్రికెటర్లతో పాటు సిబ్బంది కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే అక్షర్ పటేల్‌తో పాటు పలువురు క్రికెటర్లు కరోనా బారిన పడ్డారు.

ఈ క్రమంలో తాజాగా ఆర్సీబీకి షాక్ తగిలింది. ఆర్సీబీ ఆటగాడు డేనియల్ సామ్స్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆర్సీబీ స్వయంగా ప్రకటించింది. ‘రెండోసారి చేసిన టెస్టులో డేనియల్ సామ్స్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అతడికి ఎలాంటి కరోనా లక్షణాలు లేవు. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉండి జాగ్రత్తలు తీసుకుంటున్నాడు’ అని ఆర్సీబీ తెలిపింది.

Next Story