టీకా పంపిణీ.. కలెక్టర్లపై సీఎస్ గుస్సా

by  |
టీకా పంపిణీ.. కలెక్టర్లపై సీఎస్ గుస్సా
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు టీకా పంపిణీ తక్కువ శాతం నమోదైన జిల్లాలపై సీఎస్ సోమేశ్ కుమార్ ఫోకస్​పెట్టారు. ఆయా జిల్లాలో వ్యాక్సిన్ ​ప్రక్రియ ఎందుకు తగ్గిందనే అంశాలపై ఆయన ఆరా తీశారు. ఈ విషయంపై బీ ఆర్ కే భవన్ లో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. డోసులు అందుబాటులో ఉన్నా వెనుకబడటానికి కారణాలు చెప్పాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా గద్వాల్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, వరంగల్ రూరల్ జిల్లాలో అతి తక్కువ వ్యాక్సినేషన్ ​ప్రక్రియ జరిగిందని, ప్రజల్లో ఎందుకు అవగాహన కల్పించలేకపోయారని సంబంధిత జిల్లాల కలెక్టర్లపై సీరియస్ అయినట్లు సమాచారం. మెగా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో తప్పనిసరిగా 100 శాతం పూర్తి కావాలని అధికారులను ఆయన ఆదేశించారు. వచ్చేనెల లోపు అర్హులందరికీ కనీసం ఒక్క డోసును అయినా ఇవ్వాలని పేర్కొన్నారు.


Next Story

Most Viewed