- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రేకింగ్.. బీజేపీ ఎంపీ ఇంటిపై బాంబు దాడి.. స్వల్ప గాయాలు
<p>దిశ, వెబ్‌డెస్క్ : బీజేపీ ఎంపీ ఇంటి వద్ద బాంబు దాడి జరగడం కలకలం సృష్టించింది. బెంగాల్‌లోని భారక్‌పూర్ నియోజకవర్గ ఎంపీ అర్జున్ సింగ్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు బాంబులు విసిరారు. అయితే అదృష్టవశాత్తు ఆ సమయంలో ఇంట్లో ఎంపీ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కానీ బాంబు దాడిలో ఎంపీ ఇంటి వద్ద డ్యూటీలో ఉన్న CRPF జవానుకు స్వల్ప గాయాలైనట్టు సమాచారం. వివరాల ప్రకారం.. బుధవారం తెల్లవారుజామున మూడు భారీ శబ్దాలు వినిపించాయని […]</p>

దిశ, వెబ్‌డెస్క్ : బీజేపీ ఎంపీ ఇంటి వద్ద బాంబు దాడి జరగడం కలకలం సృష్టించింది. బెంగాల్‌లోని భారక్‌పూర్ నియోజకవర్గ ఎంపీ అర్జున్ సింగ్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు బాంబులు విసిరారు. అయితే అదృష్టవశాత్తు ఆ సమయంలో ఇంట్లో ఎంపీ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
కానీ బాంబు దాడిలో ఎంపీ ఇంటి వద్ద డ్యూటీలో ఉన్న CRPF జవానుకు స్వల్ప గాయాలైనట్టు సమాచారం. వివరాల ప్రకారం.. బుధవారం తెల్లవారుజామున మూడు భారీ శబ్దాలు వినిపించాయని స్థానికులు చెప్పారు. ఈ క్రమంలో అర్జున్ సింగ్ ఇంటి వద్ద వరుసగా మూడు బాంబులు విసిరినట్లు తెలుస్తోంది. దీంతో ఆ ప్రాంతం అంతా పొగ అలుముకుంది. అయితే పనుల నిమిత్తం అర్జున్ సింగ్ ఢిల్లీలో ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది.
అయితే ఈ ఘటనపై బెంగాల్ గవర్నర్ జగ్‌దీప్ ధన్‌కర్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఆందోళనకరంగా ఉన్నాయని పేర్కొన్నారు.







