అకాల వర్షాలతో అరటి రైతులకు తీరని నష్టం

by  |
అకాల వర్షాలతో అరటి రైతులకు తీరని నష్టం
X

దిశ‌, ఖ‌మ్మం: ఖమ్మం జిల్లాలో కురిసిన అకాల వ‌ర్షాలు అర‌టి రైతుల‌కు తీర‌ని న‌ష్టాల‌ను మిగిల్చాయి. వారం రోజుల కిందట పడిన వర్షాలకు ఉమ్మ‌డి జిల్లాలోని పెనుబ‌ల్లి, బూర్గ‌ంప‌హాడ్‌, భ‌ద్రాచ‌లం, ఏన్కూరు, జూలూరుపాడు ప్రాంతాల్లోని పండ్ల తోట‌లు తీవ్రంగా దెబ్బ‌తిన్నాయి. ఈ క్రమంలోనే బుధవారం వీచిన గాలివాన బీభ‌త్సానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వినోబా నగర్ గ్రామానికి చెందిన చిలుకూరి రాజేశ్‌కు చెందిన ఏడెకరాల్లో సాగుచేసిన అరటి తోట పూర్తిగా ధ్వంసమైంది. ఎకరానికి రూ. లక్ష చొప్పున పెట్టుబడి పెట్టామని, తీరా పంట చేతికొచ్చే సమయానికి ఈదురుగాలుల దెబ్బకు అరటి గెలలు నేల రాలాయని ఆవేదన వ్యక్తం చేశారు.

Tags: sudden rains, heavy winds, crops damaged, banana tree damage, 7 lakhs loss


Next Story

Most Viewed