ఆదర్శానికి ఆ గ్రామం నిదర్శనం.. 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి

by Sridhar Babu |   ( Updated:2021-09-22 07:12:34.0  )
ఆదర్శానికి ఆ గ్రామం నిదర్శనం.. 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి
X

దిశ, కల్లూరు : ఉమ్మడి ఖమ్మం జిల్లా కల్లూరు మండల పరిధిలోని క్రిస్టయ్య బంజారా గ్రామంలో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వ్యాక్సినేషన్ ప్రక్రియ వంద శాతం పూర్తయ్యింది. త్వరలోనే వందశాతం వ్యాక్సినేషన్ పూర్తైన గ్రామంగా ప్రకటించనున్నట్టు ప్రభుత్వ వైద్యులు డాక్టర్ సురేశ్ తెలిపారు. గ్రామంలో అందరికీ అవగాహన కల్పిస్తూ వ్యాక్సిన్ తీసుకునేలా కృషి చేసిన గ్రామ సర్పంచ్ పెద్దబోయన ప్రమీలా దేవి, కార్యదర్శిని, వైద్య సిబ్బందిని ఆయన అభినందించారు.

రెండు వారాల్లో మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసి.. జిల్లాలోనే వ్యాక్సిన్ కంప్లీట్ చేసుకున్న మొదటి మండలంగా గుర్తింపు తీసుకు వచ్చే విధంగా కృషి చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ప్రజాప్రతినిధులు, నాయకులు, వైద్య సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పిస్తూ గ్రామంలో వంద శాతం వ్యాక్సిన్ పూర్తయ్యే విధంగా కృషి చేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ప్రతీ ఒక్కరికి డాక్టర్ సురేశ్ ధన్యవాదాలు తెలిపారు.

కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పెద్ద పోయిన ప్రమీలాదేవి, గ్రామ కార్యదర్శి ఎండీ ఆసిఫ్, ఎంపీఓ వీరస్వామి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దుర్గాప్రసాద్, ఏఎన్ఎం నిర్మల, హెల్త్ సూపర్‌వైజర్ రామారావు, అఫ్రోజ్, అంగన్వాడీలు పద్మజా, సరస్వతి, ఆశాలు సిరసాని రాణి పలువురు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed