- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గూడ్స్ రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి
గూడ్స్ రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన బాలానగర్ మండలం పెద్దాయపల్లి గ్రామ శివారులో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది.

X
దిశ, బాలానగర్: గూడ్స్ రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన బాలానగర్ మండలం పెద్దాయపల్లి గ్రామ శివారులో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. రైల్వే పోలీస్ వివరాల ప్రకారం.. బాలానగర్ మండలంలోని పెద్దాయపల్లి గ్రామ శివారులో గూడ్స్ రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి (25) ఢీకొని తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మరణించాడు. ఇతడు బాలానగర్ మండలం లోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడని తెలిసింది. గొల్లపల్లి రైల్వే స్టేషన్ మాస్టర్ లాలన్ కుమార్ ఫిర్యాదు మేరకు రైల్వే హెడ్ కానిస్టేబుల్ బి.మల్లేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతదేహం షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో ఉంచామన్నారు. మృతుడి ఆచూకీ తెలిస్తే ఫోన్ 9848090426 నెంబర్ కు సంప్రదించాలన్నారు.
Next Story






