ఘోర రోడ్డు ప్రమాదం... ఇద్దరు మృతి, ఒకరికి గాయాలు

by Taduka Kalyani |   (  Updated:2024-09-09 08:54:47  IST  )

నల్గొండ జిల్లా దామరచర్ల మండలం బొత్తలపాలెం వద్ద సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

ఘోర రోడ్డు ప్రమాదం... ఇద్దరు మృతి, ఒకరికి గాయాలు
X

దిశ, మిర్యాలగూడ టౌన్: నల్గొండ జిల్లా దామరచర్ల మండలం బొత్తలపాలెం వద్ద సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామంలో రోడ్డు పక్కన నిలిచి ఉన్న బొలెరో వాహనాన్ని అతి వేగంగా వచ్చిన డీసీఎం వాహనం ఢీకొట్టింది. దీంతో బొలెరో వాహనంలో ఉన్న నలుగురు వ్యక్తుల లో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందిన వారు యాది( 22), రిజ్వాన్ లుగా పోలీసులు గుర్తించారు. వీరు దేవరకొండ కు చెందినట్లు సమాచారం. కేబుల్ వర్క్ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

Next Story
null