- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మూడిళ్లలో చోరీ.. నగదు, ఆభరణాలు అపహరణ
గుర్తుతెలియని దుండగులు మూడిళ్లలో ఒకే రోజు రాత్రి దొంగతనానికి

దిశ,కౌడిపల్లి: గుర్తుతెలియని దుండగులు మూడిళ్లలో ఒకే రోజు రాత్రి దొంగతనానికి పాల్పడి నగదు ఆభరణాలు ఎత్తుకెళ్లిన సంఘటన మండలంలోని వెల్మకన్న గ్రామంలో ఈనెల 5న గురువారం రాత్రి జరిగింది. బాధితులు పోలీసులు వివరాలు ఇలా ఉన్నాయి. వెల్మకన్న గ్రామానికి చెందిన చాకలి సునీతను ఝరాసంగం మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన విజయ్ తో పెళ్లి జరిగింది. బతుకుదెరువు కోసం మియాపూర్ కు వెళ్లి కూలీ పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. సునీత తల్లిదండ్రులు సూరారం లో కూలి పని చేసుకుంటూ ఉంటున్నారు. వెల్మకన్నలో బంగారు వెండి ఆభరణాలు చేయించుకుందామని తల్లి లింగమ్మతో కలిసి వచ్చారు. ఇంట్లో ఫ్యాన్ చెడిపోవడంతో పాలివారైనా చాకలి బుజ్జమ్మ ఇంట్లో పడుకున్నారు.
సునీత కు చెందిన అర తులం బంగారం ఉంగరం, 20 తులాల వెండి పట్టాలు, పది తులాల వెండి కడియాలు, నగదు రూ.20 వేలు తల్లి దుర్గమ్మ కు చెందిన ఐదు వేల రూపాయలు హ్యాండ్ బ్యాగ్ లో పెట్టి వారి సొంత ఇంట్లో పెట్టి వచ్చి బుజ్జమ్మ ఇంట్లో పడుకున్నారు. గురువారం రాత్రి మూడు గంటల ప్రాంతంలో దొంగలు వచ్చారని ఇరుగుపొరుగు వారు కేకలు వేయడంతో వీరు తమ ఇంటికి వెళ్లి చూడగా తలుపు తీసి ఉంది. నగదు నగలు కనబడలేదు. అదే గ్రామానికి చెందిన మాణిక్య వెంకటేశం ఇంట్లో కూడా దొంగలు పడి మూడు వేల యుఎస్ డాలర్లను ఐదువేల రూపాయల నగదును ఎత్తుకెళ్లారు. చాకలి వెంకటేష్ ఇంట్లో కూడా దొంగలు పడి రూ.20 వేలు నగదును ఎత్తుకెళ్లారు. గుర్తు తెలియని దుండగులు బీరువాలను పగలగొట్టి బట్టలు సామాన్లను చిందరవందరగా పడేశారు. బాధితురాలు సునీత కౌడిపల్లి పోలీస్ స్టేషన్ లో శుక్రవారం ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రంజిత్ కుమార్ రెడ్డి తెలిపారు.






