- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాలికపై లైంగిక దాడి కేసులో వ్యక్తికి మూడేళ్ల జైలు
మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి మూడేళ్ళ జైలు శిక్షతో పాటుగా రూ.2000/- జరిమానా విధిస్తూ సిరిసిల్ల జిల్లా ఇన్చార్జి పోక్సో కోర్టు జడ్జి ఎన్. ప్రేమలత శుక్రవారం తీర్పు వెల్లడించినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఒక ప్రకటనలో తెలిపారు. 2018 డిసెంబర్ 15న ఇల్లంతకుంట మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక ఇంటికి దగ్గర ఒంటరిగా ఉండగా నిందితుడు చీపెల్లి మల్లయ్య బాలికకు బిస్కెట్స్ ఇస్తానని మాయ మాటలు చెప్పి తన ఇంటికి తీసుకెళ్లి లైంగికంగా వేధించాడు. మరుసటి రోజు తల్లి ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఇల్లంతకుంట అప్పటి ఎస్ఐ చంద్రశేఖర్ నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించి, కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు.
ప్రాసిక్యూషన్ తరపున పీపీ పెంట శ్రీనివాస్ వాదించగా, సీఎంఎస్ ఎస్సై రవీంద్ర నాయుడు ఆధ్వర్యంలో కోర్టు కానిస్టేబుల్ నవీన్, సీఎంఎస్ కానిస్టేబుల్ నరేందర్ లు కోర్టులో 12 మంది సాక్షులను ప్రవేశపెట్టాగా, కేసు పూర్వాపరాలను పరిశీలించిన సిరిసిల్ల జిల్లా ఇన్చార్జి పోక్సో కోర్టు జడ్జి ఎన్. ప్రేమలత నిందితుని మూడు సంవత్సరాలు జైలు శిక్షతో పాటు 2000/- రూపాయల జరిమానా విధించినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ కేసులో నిందితుడికి శిక్ష పడటంలో కృషి చేసిన పీపీ పెంట శ్రీనివాస్, సీఎంఎస్ ఎస్సై రవీంద్ర నాయుడు, కోర్టు కానిస్టేబుల్ లు నవీన్, సీఎంఎస్ కానిస్టేబుల్ నరేందర్ లను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.






