- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాళ్లు కడుక్కోవడానికి వెళ్లి మృత్యువాత
ప్రమాదవశాత్తు చెరువులో కాలుజారి పడి వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని వెంకంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.

దిశ, నాగిరెడ్డిపేట్ : ప్రమాదవశాత్తు చెరువులో కాలుజారి పడి వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని వెంకంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై మల్లారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని వెంకంపల్లి గ్రామానికి చెందిన మాటూరు రవి (39) గురువారం తాండూరు గ్రామంలో పని ఉందని ఇంట్లో చెప్పి వెళ్లి తిరిగి రాత్రి అయినప్పటికీ రాకపోవడంతో తాండూర్ నాగన్నయ్య చెరువు సమీపంలో వెతకగా అక్కడ చెప్పులు, షర్ట్ కనిపించాయి.
దాంతో శుక్రవారం ఉదయం చెరువులో గజ ఈత గాడితో వెతికించగా రవి మృతదేహం లభించిందన్నారు. మాటూరు రవి నాగనయ్య చెరువు గుడి మెట్ల ప్రాంతంలో కాళ్లు కడుక్కోవడానికి వెళ్లి ప్రమాదవశాత్తు కాలుజారి నీటిలో పడిపోయి మృతి చెందినట్లు మృతుని భార్య మాటూరి లక్ష్మిఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. మృతునికి ఇద్దరు కుమారులు ఉన్నారు.
- Tags
- person died






