- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్ లో మరో ఘరానా మోసం.. పెట్టుబడుల పేరుతో రూ.700 కోట్లకు టోకరా!
హైదరాబాద్ నగరంలో మరొక భారీ మోసం వెలుగు చూసింది.

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ నగరంలో మరొక భారీ మోసం వెలుగు చూసింది. ప్రజల అత్యాశను ఆసరాగా చేసుకొని ఓ సంస్థ కోట్లు కాజేసింది. తక్కువ పెట్టుబడి, అధిక లాభాల పేరుతో ప్రజల నుంచి అడ్డగోలుగా డబ్బులను సేకరించి ఇప్పుడు బోర్డు తిప్పేసింది.
వివరాల్లోకి వెళ్తే..
హైదరాబాద్ లోని మాదాపూర్ లో గల డీకేజెడ్(DKZ) టెక్నాలజీస్ అనే సంస్థ.. తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభాల పేరుతో నగర వ్యాప్తంగా దాదాపు 18 వేల మంది నుంచి సుమారు రూ.700 కోట్లను సేకరించింది. చివరకు ప్రజలకు లాభాల మాట పక్కన పెడితే మొదటికే మోసం జరిగింది.అయితే ఈ ఘటనకు సంబంధించి డబ్బులు పోగొట్టుకున్న బాధితులు శుక్రవారం(సెప్టెంబర్ 13) సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వద్దకు చేరుకొని, మీడియాతో తమ బాధను చెప్పుకున్నారు. అయితే బాధితుల్లో ఎక్కువ మంది ఒకే వర్గానికి చెందిన వారే ఉన్నట్లు తెలుస్తోంది.ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.






