- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Crime : మద్యం కోసం తోటి స్నేహితుడిని హత్య చేసిన స్నేహితులు..
దొంగిలించిన లిక్కర్ బాటిళ్ల పంపకం విషయంలో వాగ్వాదం చోటుచేసుకోవడంతో స్నేహితుడినే దారుణంగా హత్య చేసిన ఘటన వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం గోపాల్పూర్లో జరిగింది.

దిశ,తాండూరు : దొంగిలించిన లిక్కర్ బాటిళ్ల పంపకం విషయంలో వాగ్వాదం చోటుచేసుకోవడంతో స్నేహితుడినే దారుణంగా హత్య చేసిన ఘటన వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం గోపాల్పూర్లో జరిగింది. శుక్రవారం తాండూరు రూరల్ సీఐ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తాండూర్ డీఎస్పీ బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండల పరిధిలోని గోపాల్ పూర్ గ్రామ శివారులో ఓ వ్యక్తి సుద్ధ గుంతలో అనుమానాస్పదంగా మృతి చెందాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పెద్దేముల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తును ప్రారంభించారు.
ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఇద్దరు వ్యక్తులు సల్బత్తాపూర్ గ్రామానికి చెందిన శ్రీకాంత్, రుద్రారం గ్రామానికి చెందిన నరేష్ లను అనుమానంతో అదుపులోకి తీసుకొని పోలీసులు తమదైన శైలిలో విచారించగా శ్రీకాంత్, నరేష్ లు నేరం ఒప్పుకున్నారు. ఇద్దరిపై తరచుగా దొంగతనాలు చేస్తూ పలు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. దొంగతనాలకు పాల్పడుతున్న వీరు రుద్రారం గ్రామానికి చెందిన రమేష్ తో స్నేహం చేసుకొని పలు దొంగతనాలకు పాల్పడ్డారు. ఒక కారులో కెమెరాను దొంగిలించగా , మరో దగ్గర కల్లు కాంపౌండ్ లో 13 లిక్కర్ క్వార్టర్ బాటిల్లను దొంగిలించారు. ఈ విధంగా దొంగతనాలకు పాల్పడుతున్న వీరు ఓ రోజు దొంగతనాల వాటాల కోసం గోపాలపురం గ్రామ శివారులో సుద్ధ గని వద్ద వాటాలను పంచుకునేందుకు సిద్ధమయ్యారు. వాటాలలో లిక్కర్ వాటర్ బాటిల్లో 13 ఉండగా అందులో చనిపోయిన వ్యక్తి రమేష్ కు ఆ ఇద్దరి స్నేహితుల మధ్య విభేదాలు రావడంతో గొడవకు దారి తీసింది.
దొంగతనం విషయంపై తనకు మద్యం సీసాలు ఎక్కువగా ఇవ్వకుంటే అందరికీ చెప్తానని స్నేహితులతో తగాదాకు దిగాడు. దీంతో ఇద్దరు స్నేహితులు శ్రీకాంత్ ,నరేష్ దొంగతనం ఎక్కడ బయట పడుతుందో అని ఆవేశంతో రమేష్ ను బెల్టుతో గొంతుని నులిమి హత్య చేశారు. నిందితులు పోలీసుల విచారణలో ఇద్దరు హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. నిందితుల దగ్గర నుండి మద్యం సీసాలు, ఒక కెమెరా, హత్యకు ఉపయోగించిన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం రిమాండ్ కు తరలించారు. ఈ హత్య కేసులో త్వరలో ఛేదించినందుకు డీఎస్పీ పోలీసులను అభినందించారు. తాండూర్ రూరల్ సీఐ డి అశోక్, పెద్దేముల్ ఎస్సై గిరి తదితరులు పాల్గొన్నారు






