BREAKING: విశాఖ తీరంలో 25 వేల కేజీల డ్రగ్స్ స్వాధీనం.. ఇంటర్‌పోల్ సమాచారంతో సీబీఐ ఆపరేషన్

by Disha Web Desk 1 |
BREAKING: విశాఖ తీరంలో 25 వేల కేజీల డ్రగ్స్ స్వాధీనం.. ఇంటర్‌పోల్ సమాచారంతో సీబీఐ ఆపరేషన్
X

దిశ, వెబ్‌డెస్క్: భారీ ఎత్తున డ్రగ్స్‌ను సీ పోర్టు అధికారులు స్వాధీనం చేసుకున్న ఘటన విశాఖ తీరంలో కాసేపటి క్రితం చోటుచేసుకుంది. ఇంటర్‌పోల్ ఇచ్చిన పక్కా సమాచారంతో.. సీబీఐ చేపట్టిన ఆపరేషన్ గరుడులో భాగంగా సీపోర్టు అధికారులు 25 వేల కేజీల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. బ్రెజిల్ నుంచి జర్మనీలోని హ్యాబర్గ్ మీదుగా ఈ నెల 16న విశాఖ తీరంలో ఓ ఆక్వా ఎక్స్‌పోర్ట్స్‌కు ఓ కంటైనర్ వచ్చింది. విశ్వసనీయ సమాచారం మేరకు ఢిల్లి సీబీఐ బృదం విశాఖ సీబీఐ, కస్టమ్స్ అధికారులను అప్రమత్తం చేసింది. దీంతో ఆ కంటైనర్‌‌ను చెక్ చేయగా.. డ్రై ఈస్ట్ మిక్స్ చేసి సుమారు వెయ్యి బ్యాగుల్లో ముఠా డ్రగ్స్‌ను తరలిస్తున్నట్లుగా గుర్తించి కంటైనర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో బ్యాగులో 25 కేజీల చొప్పున డ్రగ్స్ ప్యాక్ చేసి ఉంచినట్లుగా తెలుస్తోంది. అయితే, కంటైనర్ విశాఖలోని ఓ ప్రైవేటు కంపెనీ పేరుతో డెలివరీ అడ్రస్ ఉండటం కలకలం రేపుతోంది. ఆ అడ్రస్ ఆధారంగానే కేసు నమోదు చేసిన సీబీఐ దర్యాప్తును ముమ్మరం చేసింది.


Next Story