- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమానుషం..డ్రైనేజీ కాలువలో పసికందు మృతదేహం
ఏ తల్లికి భారమైందో కానీ కళ్లు కూడా పూర్తిగా తెరవకుండానే అందరీకి దూరమైంది. తన పోత్తిళ్లలో నిద్రించాల్సిన పసికందు మురుగు కాలువ పాలైంది.

X
దిశ ప్రతినిధి,తిరుపతి: ఏ తల్లికి భారమైందో కానీ కళ్లు కూడా పూర్తిగా తెరవకుండానే అందరీకి దూరమైంది. తన పోత్తిళ్లలో నిద్రించాల్సిన పసికందు మురుగు కాలువ పాలైంది. డ్రైనేజీలో మృత శిశువు కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. స్థానిక తిరుమల నగర్ లోని కృష్ణవేణి యాదవ్ కాలనీలో డ్రైనేజీలో పురిటి బిడ్డ మృతదేహం పడి ఉండడాన్ని స్థానిక మహిళలు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటనా ప్రదేశానికి చేరుకుని విచారణ ప్రారంభించిన పోలీసులు మృత శిశువు పుట్టిందా లేక బిడ్డ పుట్టగానే డ్రైనేజీలో విసిరేశారా అన్న కోణంలో విచారణ చేస్తున్నారు. మృత శిశివును ఎస్వీ మెడికల్ కలశాలకు తరలించారు. తల్లి కోసం స్థానికులను ఆరా తీశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






