- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వట్టెవాగులో గల్లంతైన వ్యక్తి మృతి
వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని గుండ్రపల్లి గ్రామ సమీపంలో మంగళవారం వట్టెవాగులో గల్లంతైన షేక్ హజ్మత్ (35 ) వ్యక్తి మృతదేహం బుధవారం లభ్యమైంది.

దిశ,నెక్కొండ : వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని గుండ్రపల్లి గ్రామ సమీపంలో మంగళవారం వట్టెవాగులో గల్లంతైన షేక్ హజ్మత్ (35 ) వ్యక్తి మృతదేహం బుధవారం లభ్యమైంది. రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్, ఫైర్ సిబ్బంది ఘటన జరిగినప్పటి నుండి గజ ఈతగాళ్లు, డ్రోన్ కెమెరాలతో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో మడిపల్లె శివారులో బుధవారం మధ్యాహ్నం వట్టెవాగులో మృతదేహం లభ్యం కావడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
మృతునికి భార్య చాందినీ, కుమారుడు ఇఫ్రాన్, కూతురు చహన ఉన్నారు. ఇంటికి పెద్ద దిక్కును కోల్పోవడంతో కుటుంబ సభ్యుల ఆర్తనాదాలతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.పేద కుటుంబానికి చెందిన మృతుని కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. గాలింపు చర్యలల్లో తహసీల్దార్ రాజు కుమార్, సీఐ చంద్రమోహన్, చెన్నారావుపేట, నెక్కొండ ఎస్సైలు అరుణ్ కుమార్, మహేందర్, కార్యదర్శి రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
- Tags
- person died






