- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘోర రోడ్డు ప్రమాదం.. 48 మంది దుర్మరణం
by Gantepaka Srikanth |
నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రక్కు - ఇంధన ట్యాంకర్ ఢీకొని 48 మంది దుర్మరణం చెందారు. నార్త్ సెంట్రల్ నైగర్ స్టేట్లోని అగాయ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

X
దిశ, వెబ్డెస్క్: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రక్కు - ఇంధన ట్యాంకర్ ఢీకొని 48 మంది దుర్మరణం చెందారు. నార్త్ సెంట్రల్ నైగర్ స్టేట్లోని అగాయ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు అధికారులతో కలిసి ఘటనా స్థలానికి వచ్చారు. ప్రయాణికులతోపాటు పశువులను తీసుకెళ్తున్న ట్రక్కును ఇంధన ట్యాంకర్ ఢీకొని భారీ పేలుడు సంభవించిందని.. ఈ మంటల్లో చిక్కుకొని పలువురితో పాటు 50కి పైగా జీవాలు కూడా మృత్యువాత పడ్డట్లు గుర్తించారు. అనంతరం కేసునమోదు చేసుకుని దర్యా్ప్తు ప్రారంభించారు. మృతులకు సామూహిక అంత్యక్రియలు నిర్వహించినట్లు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






