రే*ప్, మతమార్పిడి, అబార్షన్, చీటింగ్ కేసులు.. ఐపీఎల్ కామెంటేటర్ అరెస్ట్

by Naga Rani Yarlagadda |

ఒక మహిళా యూట్యూబర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నటుడు, ఐపీఎల్ కామెంటేటర్, యూట్యూబ్ లో లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్న మణి మెరాజ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

రే*ప్, మతమార్పిడి, అబార్షన్, చీటింగ్ కేసులు.. ఐపీఎల్ కామెంటేటర్ అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఒక మహిళా యూట్యూబర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నటుడు, ఐపీఎల్ కామెంటేటర్, యూట్యూబ్ లో లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్న మణి మెరాజ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. సెప్టెంబర్ 18న తోటి మహిళా యూట్యూబర్ అతనిపై అత్యాచారం, బలవంతపు మతమార్పిడి, అబార్షన్, మోసం వంటి అభియోగాలు మోపింది. ఘజియాబాద్ లోని ఖోడా పోలీసులు అతడిని అరెస్ట్ చేసి.. ట్రాన్సిట్ రిమాండ్ పై ఘజియాబాద్ కు తరలించారు. మణిమెరాజ్ కామెడీ వీడియోలతో సోషల్ మీడియాలో మిలియన్ల ఫాలోవర్లను సంపాదించాడు. సోషల్ మీడియా ద్వారా వచ్చిన ఫేమ్ తో భోజ్ పురి సినిమాల్లో నటించాడు. అతను నటించిన సినిమాల్లో ఒకటి ఇటీవలే విడుదలైంది. జియోటీవీ కోసం భోజ్ పురిలో ఐపీఎల్ కామెంటేటర్ గా కూడా పనిచేశాడు. గతంలో అతనొక కసాయి అని తెలిసి లక్షలాది మంది ఫాలోవర్లు షాకయ్యారు.

మణి మెరాజ్ తప్పుడు ఐడెంటిటీతో తనతో స్నేహం చేశాడని, తనకు మత్తు మందు ఇచ్చి.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి పదే పదే అత్యాచారం చేశాడని మహిళా యూట్యూబర్ ఆరోపించింది. అసహజ లైంగిక చర్యకు బలవంతం చేశాడని, మతం మారాలని ఒత్తిడి చేయడంతో పాటు.. అబార్షన్ చేయించుకోవాలని బెదిరించాడని ఫిర్యాదులో ఆరోపించింది. మణిమెరాజ్ కుటుంబం కూడా తనను గొడ్డు మాంసం తినాలని ఒత్తిడి చేశారని పేర్కొంది. మూడేళ్లుగా తనపై వేధింపులు కొనసాగుతున్నాయని, నిందితుడు తన వద్ద లక్షల రూపాయలు తీసుకుని మోసం చేశాడని వాపోయింది. మణిమెరాజ్ ను కఠినంగా శిక్షించాలని, యువతులు లవ్ జిహాద్ బారిన పడకుండా తనవంతు సహకారం అందిస్తానని తెలిపింది.

Next Story