రైల్వే ట్రాక్ పై మాజీ కౌన్సిలర్ కుమారుడు ఆత్మహత్య

by Bhanu |

చిట్యాల పట్టణంలో మంగళవారం రాత్రి విషాద ఘటన చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన 19 ఏళ్ల యువకుడు రెముడాల గణేష్ రైల్వే ట్రాక్‌ రైలు వస్తున్న సమయంలో ట్రాక్ పై దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

రైల్వే ట్రాక్ పై మాజీ కౌన్సిలర్ కుమారుడు ఆత్మహత్య
X

దిశ, చిట్యాల: చిట్యాల పట్టణంలో మంగళవారం రాత్రి విషాద ఘటన చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన 19 ఏళ్ల యువకుడు రెముడాల గణేష్ రైల్వే ట్రాక్‌ రైలు వస్తున్న సమయంలో ట్రాక్ పై దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక బాల నరసింహ స్వామి దేవాలయం దగ్గర రైల్వే ట్రాక్ వద్ద రాత్రి 11 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఎదురుగా వచ్చిన రైలుకి అడ్డంగా వెళ్లి గణేష్ ప్రాణాలు కోల్పోయాడు.

గణేష్, చిట్యాల మాజీ కౌన్సిలర్ రేముడాల లింగస్వామి కుమారుడిగా పోలీసులు గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని రైల్వే ఎస్సై రామకృష్ణ తెలిపారు. ఈ ఘటనపై చిట్యాల రైల్వే స్టేషన్ మాస్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story