కుంటలో పడిపోయి యువకుడు మృతి

by Bhanu |

నిర్మల్ జిల్లా భైంసా మండలం మాంజ్రీ గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది.

కుంటలో పడిపోయి యువకుడు మృతి
X

దిశ, భైంసా: నిర్మల్ జిల్లా భైంసా మండలం మాంజ్రీ గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామ సమీపంలోని నీటి కుంటలో బుధవారం ఒక యువకుడు మృతదేహంగా కనిపించాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి పరిశీలించగా, అతడిని అదే గ్రామానికి చెందిన పారిశుద్ధ్య కార్మికుడు బన్సోడే కిరణ్ (19) గా గుర్తించారు. కుటుంబసభ్యుల వివరాల ప్రకారం, కిరణ్ ఆదివారం నుంచి కనిపించకుండా ఉన్నాడు. నేడు అతడి మృతదేహం కనిపించడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Next Story