ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న యువకుడు.. అసలేం జరిగిందంటే?

by Gantepaka Srikanth |   (  Updated:2025-04-07 12:58:30  IST  )

మేడ్చల్ జిల్లా మేడిపల్లి(Medipally) పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది.

ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న యువకుడు.. అసలేం జరిగిందంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: మేడ్చల్ జిల్లా మేడిపల్లి(Medipally) పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమించిన అమ్మాయితో పెళ్లి కాలేదని తీవ్రంగా ఆవేదన చెందిన యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఉగాది పండుగ ముందు రోజు చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. మేడిపల్లి పరిధిలోని జవహర్ నగర్‌(Jawahar Nagar)కు చెందిన సాయి పవన్ (28) అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన ఓ అమ్మాయితో ప్రేమాయణం కొనసాగించాడు. పెళ్లి చేసుకోవాలని ఇద్దరూ గట్టిగా ఫిక్స్ అయ్యారు. చివరి నిమిషంలో వారి పెళ్లికి అమ్మాయి కుటుంబసభ్యులు నిరాకరించారు. దీంతో అమ్మాయిని మర్చిపోలేక, తనను వదిలి వేరే యువతిని పెళ్లి చేసుకోలేక ఆ యువకుడు కొన్నిరోజుల పాటు తీవ్ర మనోవేధనకు గురయ్యాడు. చివరకు చేసేదేం లేదని గ్రహించి ఉగాది(Ugadi) పండుగ రోజున అమ్మాయి ఇంటిముందు పెట్రోల్ పోసుకోని నిప్పంటించుకున్నాడు. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికే తీవ్ర గాయాలు కావడంతో ఇన్ని రోజులు వైద్యులు ఐసీయూలో చికిత్స అందించారు. సోమవారం పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు.

Next Story