కొడుకు కాదు రాక్షసుడు.. తల్లిదండ్రులు, చెల్లిని హత్య చేసి, ఆపై!

by Ajay Maddhiboyina |   (  Updated:2026-01-31 05:43:08  IST  )

క‌ర్నాట‌క‌లో దారుణం జ‌రిగింది. తల్లిదండ్రుల‌ను, చెల్లిని హ‌త్య చేసిన కుమారుడు వారిని ఇంట్లో పాతిపెట్టాడు. ఈ ఘ‌ట‌న విజ‌య‌న‌గ‌ర జిల్లా కొట్టూరు గ్రామంలో చోటు చేసుకుంది.

కొడుకు కాదు రాక్షసుడు.. తల్లిదండ్రులు, చెల్లిని హత్య చేసి, ఆపై!
X

దిశ‌, వెబ్ డెస్క్: క‌ర్నాట‌క‌లో దారుణం జ‌రిగింది. తల్లిదండ్రుల‌ను, చెల్లిని హ‌త్య చేసిన కుమారుడు వారిని ఇంట్లో పాతిపెట్టాడు. ఈ ఘ‌ట‌న విజ‌య‌న‌గ‌ర జిల్లా కొట్టూరు గ్రామంలో చోటు చేసుకుంది. భీమ‌రాజ్ 50, జ‌య‌ల‌క్ష్మి 45 దంపతుల‌కు అమృత 17, అక్ష‌య్ కుమార్ 24 అనే ఇద్ద‌రు సంతానం ఉన్నారు. కాగా అక్ష‌య్ కుమార్ ఈ నెల 27న త‌న తల్లిదండ్రులు, సోద‌రి క‌నిపించ‌డం లేదు అంటూ పోలీసులకు పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు.

ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు విచార‌ణ ప్రారంభించారు. ఈ క్ర‌మంలో అక్ష‌య్ కుమార్ క‌ద‌లిక‌ల‌పై వారికి అనుమానం వ‌చ్చింది. దీంతో అతడిని విచారించగా తానే హ‌త్య చేశానని ఒప్పుకున్నాడు. నిందితుడి త‌ల్లిదండ్రులను, సోద‌రిని దారుణంగా హ‌త్య చేసి ఇంట్లోనే పాతిపెట్టిన‌ట్టు గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు హ‌త్య‌కు గ‌ల కార‌ణాల గురించి ద‌ర్యాప్తు చేస్తున్నారు. అక్ష‌య్ స్థానికంగా టైర్ల దుకాణం న‌డుపుతూ జీవ‌నం కొన‌సాగిస్తున్నాడు.

Next Story