గణేష్ నిమజ్జనం ఊరేగింపులో యువకుడి హత్య.. కత్తులతో దాడి.. అరుపులు వినబడకుండా డీజే సౌండ్స్ (వీడియో)

by Sujitha Rachapalli |   (  Updated:2025-09-07 18:32:00  IST  )

దేశ వ్యాప్తంగా గణేష్ నిమజ్జనం ఉత్సవాలు ఘనంగా జరిగాయి. అక్కడక్కడ విషాదకర సంఘటనలు చోటు చేసుకున్నాయి. కానీ ఉత్తరప్రదేశ్ మీరట్ జిల్లాలో మాత్రం ఏకంగా హత్య జరిగింది. సర్ధానాలో గణేష్ నిమజ్జనం ఊరేగింపులో యువకుడు బాబీ గౌతమ్‌పై కత్తులతో

గణేష్ నిమజ్జనం ఊరేగింపులో యువకుడి హత్య.. కత్తులతో దాడి.. అరుపులు వినబడకుండా డీజే సౌండ్స్ (వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్: దేశ వ్యాప్తంగా గణేష్ నిమజ్జనం ఉత్సవాలు ఘనంగా జరిగాయి. అక్కడక్కడ విషాదకర సంఘటనలు చోటు చేసుకున్నాయి. కానీ ఉత్తరప్రదేశ్ మీరట్ జిల్లాలో మాత్రం ఏకంగా హత్య జరిగింది. సర్ధానాలో గణేష్ నిమజ్జనం ఊరేగింపులో యువకుడు బాబీ గౌతమ్‌పై కత్తులతో దాడి చేశారు ప్రత్యర్థులు. జిమ్‌లో గొడవను మనసులో పెట్టుకుని శేఖర్ అనే వ్యక్తి ఇంత దారుణానికి ఒడిగట్టాడు. యువకుడు హెల్ప్ కోసం అరిచే అరుపులు వినబడకుండా డీజే సౌండ్స్‌తో కవర్ చేశారు. ఈ ఘటనలో తీవ్రగాయాలైన బాబీ.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా శేఖర్, అతని ఫ్రెండ్స్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా సెప్టెంబర్ 6న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

VIDEO

Next Story