- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వ్యవసాయ పనులు చేస్తూ ప్రమాదానికి బలైన యువ రైతు
వ్యవసాయ పనుల నిమిత్తం తన పొలంలో పని చేస్తూ ఓ యువ రైతు దుర్మరణం పాలయ్యాడు.

X
దిశ, బీర్‌పూర్: వ్యవసాయ పనుల నిమిత్తం తన పొలంలో పని చేస్తూ ఓ యువ రైతు దుర్మరణం పాలయ్యాడు. బీర్‌పూర్ మండలం కొల్వాయి గ్రామానికి చెందిన చెట్ల గంగాధర్ గౌడ్ అనే రైతు ట్రాక్టర్‌తో పొలంలో నాటు వేయిస్తున్నాడు. ఈ క్రమంలో ట్రాక్టర్‌కు అటాచ్ చేసిన గొర్రు (టిల్లర్) పని చేయక ఆగిపోవడంతో గంగాధర్ దానిని సరిచేయడానికి ప్రయత్నించాడు. కానీ అనూహ్యంగా గొర్రు ఒక్కసారిగా పైకి లేచింది. దీంతో గంగాధర్ ట్రాక్టర్, గొర్రు మధ్య ఇరుక్కుపోయి తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడికి తీవ్ర రక్తగాయాలు కాగా, అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. బాధితుడి భార్య చెట్ల రమా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రవీందర్ తెలిపారు.
Next Story






