యూకేలో పట్టపగలే దారుణం..మీ దేశానికి వెళ్లిపోవాలంటూ సిక్కు మహిళపై అత్యాచారం

by Ajay Maddhiboyina |

యూకేలో ప‌ట్ట‌ప‌గ‌లే దారుణం చోటు చేసుకుంది. 20ఏళ్ల సిక్కు మ‌హిళ‌ల‌పై ఇద్ద‌రు దుండ‌గులు అత్యాచారానికి పాల్ప‌డ్డారు. యూకేలోని ఓల్డ్ బ‌రీలో ఓ పార్కులో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

యూకేలో పట్టపగలే దారుణం..మీ దేశానికి వెళ్లిపోవాలంటూ సిక్కు మహిళపై అత్యాచారం
X

దిశ, వెబ్ డెస్క్: యూకేలో ప‌ట్ట‌ప‌గ‌లే దారుణం చోటు చేసుకుంది. 20ఏళ్ల సిక్కు మ‌హిళ‌ల‌పై ఇద్ద‌రు దుండ‌గులు అత్యాచారానికి పాల్ప‌డ్డారు. యూకేలోని ఓల్డ్ బ‌రీలో ఓ పార్కులో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. త‌న‌పై దారుణానికి పాల్ప‌డిన స‌మ‌యంలో మీ దేశానికి తిరిగి వెళ్లిపోండి అంటూ హెచ్చ‌రించార‌ని పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ దాడిని జాతి వివ‌క్ష‌తో కూడిన విద్వేష‌పూరిత నేరంగా ప‌రిగ‌ణిస్తున్నామ‌ని పోలీసులు తెలిపారు.

నింధితుల కోసం గాలిస్తున్నామ‌ని చెప్పారు. సీసీ టీవీ పుటేజీ ఆధారంగా అత్యాచారానికి పాల్ప‌డిన‌ ఇద్ద‌రు వ్య‌క్తులు శ్వేత‌జాతీయులే అని పేర్కొన్నారు. వారిలో ఒక‌రు గుండుతో భారీ శ‌రీరంతో ఉండ‌గా మ‌రొక‌రు ముదురు రంగు స్వెట్ ష‌ర్ట్ ధ‌రించి ఉన్నార‌ని తెలిపారు. ఈ ఘ‌ట‌న‌తో యూకేలోని సిక్కు స‌మాజం ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డింది. ఇటీవ‌లి కాలంలో జాత్య‌హంకార దాడులు పెర‌గ‌టంతో ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందుతున్నారు.

Next Story