- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అనారోగ్యం భరించలేక మహిళ ఆత్మహత్య
by Bhanu |
మండలంలోని ఎల్లారం గ్రామానికి చెందిన బిళ్ళ దేవక్క అనే 59సంవత్సరాల మహిళ అనారోగ్య సమస్యలు భరించలేక బుధవారం ఇంట్లో ఫ్యాన్ కు చున్నీతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొని మృతి చెందినట్లు ఎస్సై సురేష్ తెలిపారు.

X
దిశ, లక్షెట్టిపేట : మండలంలోని ఎల్లారం గ్రామానికి చెందిన బిళ్ళ దేవక్క అనే 59సంవత్సరాల మహిళ అనారోగ్య సమస్యలు భరించలేక బుధవారం ఇంట్లో ఫ్యాన్ కు చున్నీతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొని మృతి చెందినట్లు ఎస్సై సురేష్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మృతురాలు గత 10సంవత్సరాల నుండి బిపి, షుగర్, థైరాయిడ్ తో బాధపడుతుంది. ఆసుపత్రుల్లో చూపించుకొని మందులు వాడిన నయం కాలేదు.
అవే కాకుండా గత 10నెలల క్రితం కాన్సర్ వ్యాధి రావడంతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుంది. ఈరోజు హైదరాబాద్ ఆసుపత్రిలో చూపించేందుకు వెళ్లాల్సి ఉండగా కూతురు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోవడంతో బంధువులకు చెప్పగా వాళ్ళు వెళ్లి చూసేసరికి ఊరికి వేలాడుతూ చనిపోయి ఉంది. మృతురాలు కూతురు దావనపెళ్లి శ్రీవాణీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నట్లు తెలిపారు
Next Story






