తల్లి మిస్సింగ్... తల్లడిల్లుతున్న పిల్లలు.. సహాయం చేయాలని వేడుకోలు

by Muthe.Rajitha |

రెండు రోజులుగా తమ తల్లి కనిపించక పోవడంతో.. తిండి నిద్రా మానేసి రోదిస్తున్నారు ఆమె పిల్లలు.

తల్లి మిస్సింగ్... తల్లడిల్లుతున్న పిల్లలు.. సహాయం చేయాలని వేడుకోలు
X

దిశ, వెబ్ డెస్క్ : రెండు రోజులుగా తమ తల్లి కనిపించక పోవడంతో.. తిండి నిద్రా మానేసి రోదిస్తున్నారు ఆమె పిల్లలు. నారాయణపేట జిల్లా మక్తల్ కు చెందిన 43 సంవత్సరాల చిట్టెమ్మ అనే మహిళ, హైదరాబాద్ లోని నాగారంలో నివాసం ఉంటున్న కుమారుని వద్దకు ఈనెల నవంబర్ 1న వచ్చింది. ఆ తరువాత నుంచి చిట్టెమ్మ కనిపించక పోవడం, ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఆమె భర్త ఆమె బి. శివ శంకర్ నాగారం పోలీసులకు ఫిర్యాదు చేసారు.

అయితే మూడు రోజులుగా తల్లి కనిపించకపోవడంతో పోలీసుల సహాయంతో కూతురు, కుమారుడు చర్లపల్లి చుట్టు పక్కల ఆణువణువూ గాలించినా ఎక్కడా జాడ లేకపోవడంతో కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఎవరైనా చిట్టెమ్మను చూస్తే 79939 75938, 91779 75743, 93922 31060 నంబర్లకు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు. తమ తల్లి ఎవరికైనా సమాచారం ఇవ్వండి అంటూ వేడుకోలు చేస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు చిట్టెమ్మ కన్నబిడ్డలు.

Next Story